పోలీస్ స్టేషన్ స్ట్రాంగ్‌రూం నుంచి 1452 కార్టన్ల మద్యాన్ని ఎలుకలు మాయం చేశాయట! అవును మీరు విన్నది నిజమే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఎటా జిల్లా కొత్వాలీ దేహత్ స్టేషన్ పోలీసులు చెబుతున్న సమాధానం ఇది. ఒకింత నవ్వు తెప్పిస్తున్న ఈ అంశం ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారింది.
ఏం జరిగిందంటే..
వివిధ ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్న 1452 మద్యం కార్టన్లను స్టేషన్ స్ట్రాంగ్ రూంలో పెట్టారు పోలీసులు. వాటి లెక్కలు చూసే సమయంలో తేడా గమనించిన అధికారులు.. మద్యం మాయమైనట్లు గుర్తించారు. స్టేషన్ అధికారులను ప్రశ్నించగా.. మద్యం ఉన్న ప్లాస్టిక్ క్యాన్లను ఎలుకులు కొరికి, సీసాలను పగలగొట్టాయని వింత సమాధానమిచ్చారు. అయితే వారు చెబుతున్న సమాధానం ఏ మాత్రం నమ్మశక్యంగా లేదన్న ఉన్నతాధికారులు.. దర్యాప్తునకు ఆదేశించారు.