ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటి సమీపంలో బాంబు ఉందని పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే అప్రమత్తమైన లఖ్‌నవూ పోలీసులు యోగి ఇంటి సమీపంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. బాంబ్ స్క్వాడ్ సహాయంతో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. కాగా, బాంబుకు సంబంధించి ఎటువంటి ఆనవాళ్లు కనిపించకపోవడం వల్ల అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. కాళీదాస్ మార్గ్‌లోని సీఎం యోగి ఇంటి వద్ద బాంబు ఉందని తమకు సమాచారం వచ్చిందని లఖ్‌నవూ డీసీపీ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారని ఆయన వెల్లడించారు.
ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో బాంబు కలకలం.. రంగంలోకి పోలీసులు - యూపీ సీఎం బాంబు తాజా వార్తలు
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంటి సమీపంలో బాంబు ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
UP CM Home Bomb
ఫేక్ ఐడీ.. వరుస ట్వీట్లతో బెదిరింపులు..
అయితే యోగికి ఇటువంటి బెదిరింపు సందేశాలు రావడం కొత్తేమి కాదు. ఇంతకుముందు ఆదిత్యనాథ్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి చంపేస్తానని ట్విట్టర్లో బెదిరించాడు. అంతేగాక యోగి భద్రతా సిబ్బందిని కూడా బాంబు పెట్టి చంపేస్తామని హెచ్చరించాడు.