అఫ్గానిస్థాన్‌లోని కాబుల్ నది నుంచి తీసుకొచ్చిన నీటితో అయోధ్య శ్రీరామ జన్మభూమి (Ayodhya Ram Mandir) వద్ద జలాభిషేకం నిర్వహించారు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ప్రధాని మోదీ సూచనల మేరకు గంగాజలంతో కలిపి రామ మందిర నిర్మాణ ప్రాంతంలో అభిషేకం చేశారు.
అఫ్గానిస్థాన్‌కు చెందిన ఓ బాలిక ఈ నీటిని ప్రధానికి పంపించారు. కాబుల్ నదీజలంతో శ్రీరామ్ లల్లాకు (Ayodhya Ram Mandir) అభిషేకం చేయాలని మోదీని బాలిక కోరారు. ఈ నేపథ్యంలో ఆదివారం అయోధ్యలో ఈ కార్యక్రమం నిర్వహించారు యోగి. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య అభిషేకం జరిగింది.
"అఫ్గాన్ మహిళలు, యువతులందరికీ నా సానుభూతి ప్రకటిస్తున్నా. భయంతో జీవిస్తున్న బాలికలు, మహిళల మనోవేదనను అఫ్గాన్ బాలిక మనతో పంచుకుంది. ఈ నీటిని రామ్ లల్లాకు సమర్పించే అవకాశం రావడం నా అదృష్టం."