తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ భాజపా నేతకు 5 డోసుల వ్యాక్సిన్​.. ఆరో డోసుకు షెడ్యూల్​ ! - వ్యాక్సిన్​ సర్టిఫికెట్​లో తప్పులు

కరోనా టీకా(Covid vaccine) తీసుకున్నాక కొవిన్​ పోర్టల్​ ద్వారా ధ్రువపత్రం(vaccine certificate) అందిస్తోంది ప్రభుత్వం. అయితే.. టీకా రెండో డోసు(Covid vaccine second dose) తీసుకున్న ఓ వ్యక్తి తన ధ్రువపత్రం చూసి ఆశ్చర్యానికి గురికావాల్సి వచ్చింది. అందులో ఏకంగా 5 డోసులు తీసుకుని.. ఆరో డోసుకు షెడ్యూల్​ చేసుకున్నట్లు ఉంది. ఈ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​ మేరఠ్​లో జరిగింది.

Covid vaccine
కరోనా టీకా ధ్రువపత్రం

By

Published : Sep 20, 2021, 12:34 PM IST

Updated : Sep 20, 2021, 12:51 PM IST

కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న ఓ వ్యక్తి తన ధ్రువపత్రం(vaccine certificate) చూసుకుని అవాక్కయ్యాడు. పేరు తప్పో, అచ్చు తప్పు పడిందో అనుకునేరు.. సర్టిఫికేట్‌లో ఆయన టీకా 5 డోసులు తీసుకుని, ఆరో డోసుకు షెడ్యూల్‌ చేసుకున్నట్లుగా ఉంది. దీంతో కంగుతిన్న ఆయన.. అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

మేరఠ్‌లోని సర్ధానా ప్రాంతానికి చెందిన రామ్‌పాల్‌ సింగ్.. భాజపా బూత్‌ స్థాయి నాయకుడు. ఆయన.. ఈ ఏడాది మార్చి 16న తొలి డోసు, మే 8న రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఇటీవల తన టీకా ధ్రువపత్రాన్ని(vaccine certificate) డౌన్‌లోడ్‌ చేసుకోగా.. దాన్ని చూసి రామ్‌పాల్‌ ఆశ్చర్యపోయాడు. అందులో ఆయన ఐదు డోసులు తీసుకుని, ఆరు డోసుకు షెడ్యూల్‌ చేసుకున్నట్లుగా ఉంది. మార్చి 16న తొలి, మే 8న రెండో డోసు, మే 15న మూడో డోసు, సెప్టెంబరు 15న నాలుగో, ఐదు డోసులు ఇచ్చినట్లుగా ఉంది. డిసెంబరు 2021 నుంచి జనవరి 2022 మధ్య ఆరో డోసుకు షెడ్యూల్‌ కన్పిస్తోంది.

దీంతో ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు. టీకా పంపిణీ(Covid Vaccination) సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన సర్టిఫికేట్‌లో డోసుల వివరాలు తప్పుగా వచ్చాయని ఆరోపించారు. దీనిపై చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ అఖిలేశ్‌ మోహన్‌ స్పందిస్తూ.. వెబ్‌సైట్‌పై హ్యాకింగ్‌ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు.

ఇదీ చూడండి:ఒక్కరోజు హడావుడేనా?: వ్యాక్సినేషన్​ రికార్డ్​పై రాహుల్​ సెటైర్

Last Updated : Sep 20, 2021, 12:51 PM IST

ABOUT THE AUTHOR

...view details