ప్రేమ పెళ్లి కోసం మత మార్పిడికి పాల్పడే ఘటనలను నివారించేందుకు పటిష్ఠ వ్యూహాన్ని రూపొందించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఆ రాష్ట్ర మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఈమేరకు వెల్లడించారు.
లవ్ జిహాద్(ప్రేమ పేరిట మత మార్పిడికి పాల్పడటం)పై వస్తున్న ఫిర్యాదులను పరిశీలించడానికి రెండు నెలల ముందు కాన్పుర్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఈ తరహా ఘటనలను అరికట్టేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం.