ఉత్తర్‌ప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో ప్రపంచ స్థాయి బస్‌స్టేషన్ నిర్మాణానికి సోమవారం ఆమోదం తెలిపింది. రూ.400 వ్యయంతో నిర్మించనున్న ఈ స్టేషన్లో భక్తుల సౌకర్యార్థం అత్యవసర సేవలు సైతం అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ తెలిపారు.
"అయోధ్యలో నిర్మించనున్న రామాలయాన్ని దర్శించడానికి దూర ప్రాంతాల నుంచి భక్తులు రానున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రపంచస్థాయి బస్‌స్టేషన్ నిర్మించడానికి కేబినెట్ ఆమోదించింది. ఇందుకు అవసరమైన తొమ్మిది ఎకరాల భూమిని సాంస్కృతిక విభాగం.. రవాణా శాఖకు ఇవ్వనుంది. రూ.400 కోట్ల ఖర్చుతో దీనిని నిర్మించనున్నారు."