నిర్మాణంలోని ఇల్లు కూలి.. 24 మంది సజీవ సమాధి! - ఘోర ప్రమాదం
यूपी के बुलंदशहर में बड़ा हादसा सामने आया है. मकान का लेंटर गिरने से 24 मजदूर दब गये हैं.
22:27 February 12
నిర్మాణంలోని ఇల్లు కూలి.. 24 మంది సజీవ సమాధి!
UP Bulandshahr fall of house: ఉత్తర్‌ప్రదేశ్ బులంద్‌షహర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శికార్పుర్ ప్రాంతంలో ఓ ఇల్లు కూలిన ఘటనలో 24 మంది కూలీలు సజీవ సమాధి అయ్యారు. పలువురు గాయపడ్డారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
మేరఠ్-బదాయూ రహదారికి ఆనుకొని ఉన్న శికార్పుర్ కొత్వాలీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
ఇల్లు నిర్మాణంలో ఉండగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. స్థానిక వ్యక్తే ఇక్కడ భవనాలను నిర్మిస్తున్నాడని చెప్పారు.