ఉత్తర్ప్రదేశ్ బలియాకు చెందిన భాజపా ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. గోమూత్రం తాగితే కరోనా వైరస్ సోకదని చెబుతూ ఓ వీడియో సందేశం ఇచ్చారు.
"నేను ప్రతిరోజు ఉదయమే గోమూత్రం తాగుతా. అందుకే ప్రజల కోసం రోజులో 18 గంటల పాటు పనిచేసినా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నా. ప్రజలు కూడా గోమూత్రం తాగడం అలవాటు చేసుకోండి. ఓ గ్లాసు చల్లని నీటిలో గోమూత్రం కలుపుకొని తాగాలి. ఇది తీసుకునే వ్యవధి అరగంటకు మించకుండా చూసుకోవాలి."
--సురేంద్ర సింగ్, భాజపా ఎమ్మెల్యే.