ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా ఎమ్మెల్యే ధీరజ్ ఓజా.. ప్రతాప్‌గఢ్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద హైరానా చేశారు. స్థానిక నాయకుల ఆదేశాలతో తన అనుచరుల పేర్లను ఓటర్ లిస్టు నుంచి తొలగించారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. రాణి నియోజకవర్గానికి చెందిన ఈ ఎమ్మెల్యే.. తన బట్టలను తానే చించుకొని జిల్లా ఎస్పీ తనను కొట్టారని ఆరోపించారు. రోడ్డుపైనే పడుకొని, ఎస్పీ తనను భయపెట్టాడని చెప్పుకొచ్చారు.
ఎమ్మెల్యే హైడ్రామా.. బట్టలు చించుకొని ఆందోళన - యూపీలో ఎమ్మెల్యే ధీరజ్ ఓజా బట్టలు చింపుకున్న ఘటన
ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాణి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ధీరజ్ ఓజా.. జిల్లా కలెక్టర్ కార్యలయం ముందు హైడ్రామా చేశారు. తన బట్టలు తానే చించుకొని, ఎస్పీ తనను కొట్టారని ఆరోపించారు.
యూపీలో ఎమ్మెల్యే ధీరజ్ ఓజా బట్టలు చింపుకున్న ఘటన
కాగా.. ఎమ్మెల్యే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జిల్లా ఎస్పీ ఆకాశ్ కుమార్ చెప్పారు. జిల్లా కార్యాలయం వద్ద జరుగుతున్న ఈ డ్రామాను స్థానికులు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఇదీ చదవండి:మమత బెనర్జీకి ఈసీ నోటీసులు