ఉత్తర్ప్రదేశ్ బరేలీలో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల బాలికపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారానికి (UP minor rape) పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
బాధితురాలికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో అత్యాచారం (UP Bareilly minor rape) నిజమేనని తేలిందని పోలీసులు తెలిపారు. మూడు రోజుల క్రితం ఈ ఘటన జరిగిందని చెప్పారు. చెత్త పడేయడానికి బయటకు వెళ్లిన బాలికను గుడిసెలోకి లాక్కెళ్లి నిందితుడు అత్యాచారం చేశాడని వివరించారు.
'చెప్తే చంపేస్తాం'
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితురాలి తల్లి సిద్ధం కాగా.. నిందితుడు, అతడి తండ్రి మహిళను బెదిరించారని బాలిక బంధువులు తెలిపారు. విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని హెచ్చరించారని చెప్పారు. దీంతో బాధితురాలి తల్లి ఎవరికీ చెప్పకుండా ఉండిపోయింది.
చివరకు బాలిక ఆరోగ్య పరిస్థితి తీవ్రం కావడం వల్ల ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఆరా తీయగా.. బాధితురాలు జరిగిన విషయం చెప్పేసింది.
వైద్య కేంద్రం మెడికల్ సూపరింటెండెంట్ వాసిద్ అలీ ఇచ్చిన సమాచారంతో ఫరీద్పుర్ పోలీసులు బాలికను సంప్రదించారు. అనంతరం ఆదివారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇదీ చదవండి:స్కూళ్లు తెరవాలని మైనర్ పిటిషన్- షాకిచ్చిన సుప్రీం