ఉత్తర్ప్రదేశ్ అయోధ్యలో విషాదం జరిగింది. రెండు కుటుంబాలకు చెందిన 15 మంది సరయూ నదిలో నీట మునిగారు. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురిని అధికారులు రక్షించారు. మరో ముగ్గురు గల్లంతు కాగా.. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఎలా జరిగింది?
ఆగ్రా నుంచి రెండు కుటుంబాలకు చెందిన 15 మంది.. అయోధ్య పర్యటనకు వచ్చారు. సరయూ నది గుప్తార్ ఘాట్ వద్ద శుక్రవారం.. స్నానం చేసేందుకు వారంతా నీటిలో దిగారు. అయితే.. వారిలో ఓ మహిళ నీట మునగగా.. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించే క్రమంలో 15 మంది నీట మునిగారు. అయితే.. అందులో ముగ్గురు వ్యక్తులు తమంతట తాముగా ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకున్నారు.