UP Assembly Polls: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో రెండో విడత పోలింగ్ సజావుగా పూర్తయింది. తొలి రెండు దశల్లో కలిపి ఇప్పటివరకు 113 నియోజకవర్గాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇవన్నీ పశ్చిమ యూపీలోనివే. 2017లో వీటిలో 91 సీట్లను కమలనాథులు దక్కించుకున్నారు. ఈ దఫా పరిస్థితుల్లో మార్పు వచ్చిన సంకేతాలు కనిపిస్తున్నాయి. మలి విడతలోని పలు స్థానాల్లో పోలింగ్ 65-70% వరకు నమోదైంది. ముస్లింలు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చినట్లు దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. వారంతా ఈసారి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కూటమి వైపు మొగ్గుచూపినట్లు విశ్లేషణలొస్తున్నాయి. గతేడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇతర లౌకికవాద పార్టీల వైపు మొగ్గుచూపితే తమ ఓట్లు చీలిపోయి భాజపా విజయావకాశాలు పెరుగుతాయని గ్రహించి.. గంపగుత్తగా తృణమూల్ కాంగ్రెస్‌కు ఓటేశారు! ఇప్పుడు పశ్చిమ యూపీలోనూ అదే జరిగి ఉంటుందని అంచనా.
UP Elections: తొలి రెండు దశల్లో ఎస్పీ కూటమికే పట్టం! - ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలు
UP Elections: యూపీలో ముస్లిం ఓటర్లంతా ఈసారి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కూటమి వైపు మొగ్గుచూపినట్లు విశ్లేషణలొస్తున్నాయి. గతేడాది బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇతర లౌకికవాద పార్టీల వైపు మొగ్గుచూపితే తమ ఓట్లు చీలిపోయి భాజపా విజయావకాశాలు పెరుగుతాయని గ్రహించి.. గంపగుత్తగా తృణమూల్ కాంగ్రెస్‌కు ఓటేశారు. ఇప్పుడు పశ్చిమ యూపీలోనూ అదే జరిగి ఉంటుందని అంచనా.
ఎస్పీ కూటమికే యూపీ ఓటర్లు పట్టం!
రెండో విడతలో 55 స్థానాలకు పోలింగ్ జరగ్గా.. అందులో 33 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్ల వాటా 35-45% వరకు ఉంది. ఐదేళ్ల క్రితం ఈ నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ మధ్య చీలిపోవడంతో భాజపా లబ్ధి పొందింది. ఈ దఫా ఆ సామాజికవర్గం ఓటర్లు ఎస్పీకి మద్దతిచ్చారని తెలుస్తోంది.
ఇదీ చదవండి:గోవులపై కమలం ప్రేమ.. యూపీ ఎన్నికల్లో కలిసొచ్చేనా?