ముస్లిం ఓటర్లను ఆకర్షిస్తూ దేశవ్యాప్తంగా మజ్లిస్ పార్టీని విస్తరించాలని ప్రణాళికలు రచిస్తున్న అసదుద్దీన్ ఒవైసీ (Owaisi news).. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల్లో తనదైన ముద్రవేయాలని తహతహలాడుతున్నారు. రాష్ట్రంలోని ముస్లింలకు రాజకీయ ప్రత్యామ్నాయంగా మారాలని భావిస్తున్నారు. ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉన్న పూర్వాంచల్, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. రాష్ట్రంలో ఈ వర్గం జనాభా 20 శాతం వరకు ఉన్న నేపథ్యంలో.. అసెంబ్లీ ఎన్నికల్లో (MIM in UP election) ఇతర పార్టీలకు షాక్ ఇవ్వాలని ఒవైసీ భావిస్తున్నారు.
అయితే, ప్రస్తుత ఎన్నికల్లో ఒవైసీ అడుగులు అనుకున్నట్లుగా పడటం లేదు. యూపీలోని ఇతర పార్టీలతో జట్టుకట్టి పోటీ (MIM in UP election) చేయాలని తొలుత భావించినప్పటికీ.. అవేవీ కుదరలేదు. తొలుత పెద్ద పార్టీలపైనే దృష్టిసారించి చిన్న పార్టీలను దూరం చేసుకున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)తో కూటమి (Owaisi alliance in UP) ఏర్పాటు చేయాలని భావించారు ఒవైసీ. కానీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి కూటమి అంశాన్ని బహిరంగంగానే కొట్టిపారేశారు. ఆ తర్వాత ఓంప్రకాశ్ రాజ్భర్తో కలిసి 'భాగీదారీ సంకల్ప్ మోర్చా' పేరుతో కూటమి (Owaisi alliance in UP) ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేశారు. అయితే, చివరి క్షణంలో సమాజ్‌వాదీ పార్టీతో చేతులు కలిపిన రాజ్‌భర్.. ఒవైసీకి (MIM in UP election) హ్యాండ్ ఇచ్చారు. దీంతో ఏకాకిగా మిగిలిపోయారు ఒవైసీ. అయితే, ఒవైసీతో కూటమిని సమాజ్‌వాదీ పార్టీ వ్యతిరేకించలేదు. మజ్లిస్‌తో పొత్తుపై (Owaisi alliance in UP) ఎస్పీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ కూటమిలో చేరే అవకాశం మజ్లిస్‌కు (MIM in UP election)ఇంకా మిగిలే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఒంటరిగా ముందుకు!
ఈ పరిస్థితుల్లో ఒంటరిగానైనా వంద సీట్లలో పోటీ చేయాలని ఒవైసీ ప్రణాళికలు రచిస్తున్నారు. దళితులు, ముస్లింల ఓట్లనే లక్ష్యంగా చేసుకొని ఎన్నికల బరిలో (MIM in UP election) దిగుతున్నారు. యూపీ జనాభాలో 40 శాతానికి పైగా వాటా ఈ రెండు సామాజిక వర్గాలదే. వీరంతా సమాజ్‌వాదీ పార్టీ ఓటు బ్యాంకుగా ఉన్నారు. మజ్లిస్ ఒంటరిగా పోటీ చేస్తే ఎక్కువగా నష్టపోయేది అఖిలేశ్ పార్టీనే. ముస్లిం, దళితుల ఓట్లను ఎంఐఎం (MIM in UP election) చీల్చగలిగితే.. ఎస్పీకి అపార నష్టం జరుగుతుంది. అదే సమయంలో ఇది భాజపాకు కలిసొస్తుంది.