తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'తాలిబన్ల ఆక్రమణ.. భారత్‌కు హాని.. పాక్‌కు ప్రయోజనం'

తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను (Afghan Taliban takeover) ఆక్రమించుకోవడం భారత్‌కు మంచి పరిణామం కాదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ (Owaisi) పేర్కొన్నారు. దానివల్ల కేవలం పాకిస్థాన్‌కే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ పర్యటనలో ఉన్న ఒవైసీ (Owaisi UP tour).. తాలిబన్లను కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులుగా గుర్తిస్తుందా? లేదా? అని ప్రశ్నించారు.

owaisi, afghanistan, taliban, up elections
ఒవైసీ,

By

Published : Sep 8, 2021, 6:59 AM IST

అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు(Afghanistan Taliban) ఆక్రమించుకోవడం భారత్‌కు అంత మంచిది (Taliban Afghan takeover) కాదని, పాకిస్థాన్‌కు మాత్రం మేలు చేకూర్చుతుందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ (Owaisi MIM) వ్యాఖ్యానించారు. 'అఫ్గానిస్థాన్‌లో అభివృద్ధి కార్యకలాపాల కోసం మనం రూ.8000 కోట్లు వెచ్చించాం (India help Afghanistan). ఇప్పుడు అక్కడ తాలిబన్లు కూర్చున్నారు. అఫ్గానిస్థాన్‌లో చోటుచేసుకుంటున్న మార్పులు (Afghanistan effect on India) మనకు అంత మంచివి కావు' అని అన్నారు. అఫ్గానిస్థాన్​లో చోటుచేసుకుంటున్న పరిణామాలన్నీ పాకిస్థాన్‌కు లబ్ధి చేకూర్చేవేనని వ్యాఖ్యానించారు.

2022 శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ ఎంపీ ఆతిక్‌ అహ్మద్‌ (Atiq Ahmad AIMIM) సతీమణి మంగళవారం ఏఐఎంఐఎంలో చేరారు. ఓ క్రిమినల్‌ కేసుకు సంబంధించి ప్రస్తుతం గుజరాత్‌ జైల్లో ఉన్న తన భర్త కూడా చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఒవైసీ విలేకరులతో మాట్లాడారు.

అఫ్గానిస్థాన్​లోని తాలిబన్లను కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులుగా గుర్తిస్తుందా? లేదా? అనేది స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

'యూపీ ఎన్నికల్లో పోరాడి గెలుస్తాం'

ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏఐఎంఐఎం (UP election MIM) అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ తన మూడురోజుల పర్యటనకు గాను మంగళవారం లఖ్‌నవూ నగరం చేరుకున్నారు. ఆయన అయోధ్య కూడా వెళతారు.

యూపీ పర్యటనలో ఒవైసీ

ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ... యూపీ ఎన్నికల్లో 100 స్థానాల్లో పోరాడి గెలుస్తామని చెప్పారు.

ఒవైసీ అయోధ్య పర్యటన వివాదాస్పదంగా మారడంతో గోడ పత్రికల్లో ఫైజాబాద్‌ బదులుగా అయోధ్య పర్యటనగా మార్చారు.

ఇదీ చదవండి:G20 Summit: 2023లో జీ20కి భారత్​ ఆతిథ్యం

ABOUT THE AUTHOR

...view details