తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీలో నాల్గో దశ పోలింగ్.. ఉదయమే ఓటేసిన మాయావతి - up assembly voting 4th phase

UP assembly election 4th phase: ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 వరకు పోలింగ్ కొనసాగనుంది. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉదయమే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

up election 4th phase
యూపీ ఎన్నికలు

By

Published : Feb 23, 2022, 8:14 AM IST

UP assembly election 4th phase: ఉత్తర్​ప్రదేశ్​లో నాలుగో విడత పోలింగ్ ప్రారంభమైంది. 9 జిల్లాల పరిధిలోని 59 స్థానాలకు ఓటింగ్‌ జరుగుతోంది. మొత్తం 624మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

బారులు తీరిన ఓటర్లు
థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్న సిబ్బంది

UP 4th phase Mayawati vote

బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఉదయమే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే.. లఖ్​నవూలోని మున్సిపల్ నర్సరీ స్కూల్​కు చేరుకున్న మాయావతి.. అక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్​లో ఓటేశారు.

పోలింగ్ బూత్​లో మాయావతి
ఓటేస్తున్న మాయావతి

లఖ్‌నవూ జిల్లాతో పాటు దశాబ్దాలపాటు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనూ ఈ విడతలోనే.. ఓటింగ్‌ జరగనుంది. జాతీయస్థాయిలో తీవ్ర కలకలం రేపిన లఖింపుర్‌ ఖేరీ ఘటన జరిగిన నియోజకవర్గంలోనూ నాల్గో విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి.

క్యూలో ఓటర్లు
  • 2.3కోట్లు:నియోజకవర్గాల్లో ఓటర్లు
  • 13,817: పోలింగ్ కేంద్రాలు
  • 24,643: పోలింగ్ బూత్​ల సంఖ్య

గత ఎన్నికల్లో ఇలా..

2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న 59స్థానాల్లో భాజపానే ఎక్కువ సీట్లు గెలుచుకుంది. భాజపా-51, ఎస్పీ-4, బీఎస్పీ-3, అప్నాదళ్‌ ఒకచోట గెలుపొందాయి.

ఇదీ చదవండి:ఎన్నికల ప్రచార ఆంక్షల్లో మరిన్ని సడలింపులు.. వాటికి ఈసీ ఓకే

ABOUT THE AUTHOR

...view details