UP assembly election 1st phase: సార్వత్రిక సమరానికి సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తొలి దశ ప్రశాంతంగా ముగిసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని 58 స్థానాలకు జరిగిన ఈ విడత పోలింగ్‌లో ఓటర్లు భారీ ఎత్తున తరలి వచ్చారు. అయితే, పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి.
UP polling 1st phase:
ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. చాలా చోట్ల ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగింది. సాయంత్రం 5 గంటల వరకు 57.79 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. సాంకేతిక కారణాల వల్ల కొన్ని చోట్ల ఈవీఎంలను మార్చినట్లు తెలిపారు. ఖైరానా అసెంబ్లీ నియోజకవర్గంలోని దుందుఖేడాలో పేద ఓటర్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించలేదన్న సమాజ్‌వాదీ పార్టీ ఆరోపణలపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయంపై దర్యాప్తు జరపాలని సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించినట్లు తెలిపారు.
'కావాలనే నెమ్మదిగా పోలింగ్'
మరోవైపు, ఏ నియోజకవర్గాల్లో ఈవీఎంలు పనిచేయలేదో గుర్తించి చర్యలు తీసుకోవాలన్ని ఎన్నికల సంఘాన్ని కోరారు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్. పోలింగ్‌ను కావాలని నెమ్మదిగా సాగేలా చేశారని ఆరోపించారు. దీనిపై ఈసీ చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. పారదర్శక ఓటింగ్ జరిగేలా చూడటం ఈసీ అతిపెద్ద బాధ్యత అని ట్వీట్ చేశారు.
పెళ్లి దుస్తుల్లో వచ్చి...