ఓ మతానికి చెందిన వృద్ధుడిపై దాడి చేసిన కేసులో దర్యాప్తుకు హాజరుకావాలని ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరికి యూపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు లోనీ బోర్డర్ పోలీస్ స్టేషన్‌లో వివరణను రికార్డు చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ నెల 5వ తేదీన 'జై శ్రీరామ్' అని పలకాలని ఓ వ్యక్తిపై దాడి చేసిన వీడియోను కాంగ్రెస్ నాయకులు, పలువురు పాత్రికేయులు, ది వైర్ అనే వెబ్సైట్ మతపరమైన ఘర్షణలు సృష్టించాలనే ఉద్దేశంతో షేర్ చేశారని నోటీసుల్లో తెలిపారు.