సామాజిక మాధ్యమాల వేదికగా తాలిబన్లను విమర్శించిందన్న కారణంతో.. ఆగ్రహించిన కొందరు దుండగులు ఓ మహిళ మొబైల్ నంబర్‌ను పోర్న్ సైట్లలో పెట్టారు. దీంతో ఆ మహిళ.. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు, మెసేజ్‌ల ద్వారా లైంగిక వేధింపులు ఎదుర్కొంటోంది.
ఇదీ జరిగింది..
ఉత్తరప్రదేశ్‌లో ఓ ఎన్జీఓను నడుపుతున్న సామాజిక కార్యకర్తకు కొద్ది రోజులుగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అసభ్యకరమైన ఫోన్లు, మెసేజ్‌లు విపరీతంగా వస్తున్నాయి. తన నంబర్ పోర్న్ సైట్లలో ఉందనే.. విషయం తెలుసుకున్న ఆమె గాజీపుర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన ఎన్జీఓ ప్రమోషన్ కోసం నంబర్‌ను సామాజిక మాధ్యమాల్లో ఉంచినట్లు తెలిపింది.
అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా సేనలు వైదొలగిన క్రమంలో.. ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేసింది బాధిత మహిళ. దానిపై కొందరు అభ్యంతరకరమైన కామెంట్లు చేసినట్లు పోలీసులకు తెలిపింది.
ఇవీ చదవండి: