UP Accident Soldiers: ఉత్తరప్రదేశ్లోని ముందేర్వా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై పోలీసుల వాహనాన్ని.. లారీ ఢీకొట్టగా ముగ్గురు సీఐఎస్ఎఫ్ జవాన్లు మరణించారు. మరో ఇద్దరు సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.
మృతులు వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఖజ్హౌలా పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.