UP Girl Gangrape: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఐదున్నరేళ్ల బాలికపై ఇద్దరు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మాయమాటలు చెప్పి బాలికను చెరకు తోటలోకి వచ్చేలా చేసుకున్నారు. అక్కడే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన షాజహానపుర్లోని బండా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ఐదేళ్ల బాలికపై ఇద్దరు మైనర్ల అత్యాచారం.. చెరకు తోటలోకి తీసుకెళ్లి.. - ఉత్తర్‌ప్రదేశ్ గ్యాంగ్‌రేప్
UP 5 year old girl raped: యూపీలో ఐదేళ్ల బాలికపై ఇద్దరు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చెరకు తోటకు తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. నిందితుల్లో ఒకరి వయసు ఏడేళ్లు కాగా, మరొకరికి 11ఏళ్లు ఉంటాయని పోలీసులు తెలిపారు.
UP Girl Gangrape
నిందితుల్లో ఒకరి వయసు ఏడేళ్లు కాగా.. మరొకరికి 11ఏళ్లు ఉంటాయని జిల్లా ఎస్పీ సంజీవ్ బాజ్‌పాయ్ పేర్కొన్నారు. అత్యాచారం జరిగిన రోజు బాలిక ఏడుస్తూ ఇంటికి వెళ్లిందని తెలిపారు. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పిందని వెల్లడించారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామని చెప్పారు. నిందితుల కోసం వెతుకుతున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: