తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీలో 4వ దశ పోలింగ్ ప్రశాంతం - up-4th-phase-polling

up-4th-phase-polling
యూపీలో 4వ దశ పోలింగ్

By

Published : Feb 23, 2022, 6:52 AM IST

Updated : Feb 23, 2022, 6:11 PM IST

18:10 February 23

ఉత్తర్​ ప్రదేశ్​లో నాలుగో విడత పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 57.45శాతం ఓటింగ్ నమోదైంది. ఈ దఫా మొత్తం 624 మంది బరిలో నిలవగా.. మార్చి 10న వీరి భవితవ్యం తేలనుంది.

16:00 February 23

50 శాతం ఓటింగ్​..

ఉత్తర్​ప్రదేశ్​ నాలుగో విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు 49.89 శాతం పోలింగ్​ నమోదైంది.

13:48 February 23

ఉత్తర్​ప్రదేశ్​లో నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 37.45 శాతం ఓటింగ్ నమోదైంది.

10:44 February 23

ఉత్తర్​ప్రదేశ్​లో నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. తొమ్మిది గంటల వరకు 9.10 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

07:22 February 23

బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. లఖ్​నవూలోని మున్సిపల్ నర్సరీ స్కూల్​లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్​లో ఓటేశారు.

07:13 February 23

ఉత్తర్​ప్రదేశ్​లో నాలుగో విడత పోలింగ్ ప్రారంభమైంది. 9 జిల్లాల పరిధిలోని 59 స్థానాలకు ఓటింగ్‌ జరుగుతోంది. మొత్తం 624మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

06:19 February 23

LIVE UPDATES: యూపీలో 4వ దశ పోలింగ్​

ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలకు నాలుగో విడత పోలింగ్‌ 7 గంటలకు ప్రారంభం కానుంది. 9 జిల్లాల పరిధిలోని 59 స్థానాలకు ఓటింగ్‌ జరగనుంది. మొత్తం 624మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

లఖ్‌నవూ జిల్లాతో పాటు దశాబ్దాలపాటు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనూ ఈ విడతలోనే.. ఓటింగ్‌ జరగనుంది. జాతీయస్థాయిలో తీవ్ర కలకలం రేపిన లఖింపుర్‌ ఖేరీ ఘటన జరిగిన నియోజకవర్గంలోనూ నాల్గో విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి.

2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న 59స్థానాల్లో భాజపా-51, ఎస్పీ-4, బీఎస్పీ-3, అప్నాదళ్‌ ఒకచోట గెలుపొందాయి. ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసిన ఈడీ మాజీ అధికారి రాజేశ్వర్‌సింగ్‌ లఖ్‌నవూ జిల్లా సరోజినీనగర్‌ స్థానం నుంచి భాజపా తరఫున బరిలో ఉన్నారు.

న్యాయశాఖ మంత్రి బ్రిజేశ్‌ పాఠక్‌ లఖ్‌నవూ కంటోన్మెంట్‌., మరోమంత్రి అశుతోష్‌ టాండన్‌ లఖ్‌నవూ తూర్పు నుంచి పోటీ చేస్తున్నారు. మొత్తం.. ఏడు విడతల్లో యూపీ శాసనసభ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది.

Last Updated : Feb 23, 2022, 6:11 PM IST

ABOUT THE AUTHOR

...view details