చల్లగా వాన పడుతుంటే ఉదయాన్నే వేడివేడి దోశ లాగించేస్తే ఆ మజానే వేరు. దోశల్లో ఇప్పటికే మనకు ఎన్నో వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. అయితే చేసే పద్ధతే పూర్తి భిన్నంగా ఉంటే.. దానిపై మరింత ఆసక్తి కలుగుతుంది. అందుకే.. మంటల్లో దోశ చేసి ఎప్పుడెప్పుడు తినాలా అనే కోరిక కలిగేలా చేస్తున్నారు మధ్యప్రదేశ్ ఇందోర్లోని ఛప్పన్ రెస్టారెంట్ నిర్వాహకులు.
విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో అమర్ సిరోహీ అనే ఫుడ్ బ్లాగర్ షేర్ చేశారు.
నలువైపులా నిప్పు రవ్వలు, మంటల మధ్య కార్న్ చీజ్ దోశ తయరవుతుండగానే తినేయాలనే అత్రుత కలుగుతుంది.