MAHARASHTRA UNNATURAL SEX: మహారాష్ట్రలో ఇద్దరు యువకులు కలిసి మరో యువకుడిపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డారు. నాగ్‌పుర్ నగరంలో ఈ ఘటన జరిగింది. నిందితులను అవేశ్ మిర్జా(23), అనిల్ ఉయికేగా (20) పోలీసులు గుర్తించారు.
ఓ డేటింగ్ యాప్ ద్వారా బాధితుడితో (19) వీరు పరిచయం పెంచుకున్నారు. ఒకరోజు కలుద్దామని స్పిన్నింగ్ మిల్లు దగ్గరికి రమ్మని పిలిచారు. శుక్రవారం మధ్యాహ్నం తర్వాత బాధితుడు వీరు చెప్పిన చోటుకు వచ్చాడు. నిందితులు అతడిని లైంగికంగా బలవంతం చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.
జరిగిన ఘటన గురించి యువకుడు తన తల్లిదండ్రులతో చెప్పాడు. అనంతరం పోలీసులను ఆశ్రయించాడు. నిందితుల గురించి వివరాలు చెప్పి ఫిర్యాదు చేశాడు. ఐపీసీ సెక్షన్ 377, 34 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
యువకుడిపై లైంగిక దాడి.. నిందితులిద్దరూ యువకులే - మహారాష్ట్ర న్యూస్
పంతొమ్మిదేళ్ల యువకుడిపై మరో ఇద్దరు యువకులు అసహజ లైంగిక దాడి చేశారు. డేటింగ్ యాప్ ద్వారా పరిచయం చేసుకొని యువకుడిని లైంగికంగా బలవంతం చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
UNNATURAL SEX