ఉత్తర్‌ప్రదేశ్‌లోని గంగానదిలో మరోసారి శవాలు తేలియాడటం స్థానికంగా కలకలం రేపుతోంది. ఉన్నావ్ జిల్లాలోని గంగా నదిలో ఆదివారం మృతదేహాలు కొట్టుకురాగా స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
ఉన్నావ్‌లో జరగలేదు..
నీటి ఉద్ధృతి పెరగటం వల్ల నది ఒడ్డున ఇసుకలో పాతిపెట్టిన కొవిడ్ మృతదేహాలు నీటిలోకి కొట్టుకొచ్చాయని స్థానికులు అనుమానిస్తున్నారు. మరోవైపు.. జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగలేదని ఉన్నావ్ జిల్లా అధికారులు తెలిపారు. తాము నదీపరివాహక ప్రాంతంలో గస్తీ నిర్వహించామని.. నదిలో శవాలు కనిపించలేదన్నారు.
బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని నదీపరివాహక ప్రాంతాల్లో కుప్పలు తెప్పలుగా మృతదేహాలు లభ్యం కావటంపై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్న క్రమంలో.. రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నాయి.