ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్ బాధితుల్లో ఇద్దరు చనిపోగా.. మరో బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆమె ఆరోగ్యం కుదుటపడుతున్నట్లు కాన్పుర్ పోలీసులు తెలిపారు. దీంతో వెంటిలేటర్‌ను వైద్యులు తొలగించినట్లు పేర్కొన్నారు. బాలిక మాట్లాడే పరిస్థితుల్లో లేదన్నారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని.. వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కాన్పుర్ డిప్యూటీ ఐజీ ప్రీతేంధర్ సింగ్ తెలిపారు.
బాలిక చికిత్స పొందుతున్న ఆసుపత్రి ఆవరణలో పెద్ద మొత్తంలో పోలీసు బలగాలను మోహరించారు. బాధితురాలి ఆరోగ్యానికి సంబంధించి ఆసుపత్రి వర్గాలు ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేస్తున్నాయి. తొలుత బాలిక షాక్‌కు గురైనట్లు వైద్యులు భావించారు. తరువాత ఆమె విషం తీసుకున్నట్లు అనుమానించారు. దీంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ప్రస్తుతం బాలిక కోలుకుంటున్నట్లు హెల్త్ బులిటెన్‌లో వైద్యులు పేర్కొన్నారు.
ఉదిత్ రాజ్ ట్వీట్‌పై కేసు నమోదు..
ఉన్నావ్‌లో ఘటనలో ఇద్దరు బాలికలు మృతి చెందడంపై కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా అసత్యాలను ప్రచారం చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికలపై అత్యాచారం జరిగిందని, వారి మృతదేహాలను కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా అంతిమ సంస్కారాలు చేస్తున్నట్లు ఉదిత్ రాజ్ ట్వీట్ చేశారు.