తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉన్నావ్​ కేసులో 'ఫేక్​ పోస్టు'లపై పోలీసుల నజర్ - ఉత్తర్​ ప్రదేశ్ ఉన్నావ్ కేసు

ఉత్తర్​ ప్రదేశ్ ఉన్నావ్​ ఘటనపై నకిలీ వార్తలను పోస్ట్​ చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో 8 ట్విట్టర్​ ఖాతాలపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు పోలీసులు. వీటిలో సీనియర్​ జర్నలిస్ట్​ బార్కా దత్​కు చెందిన 'మోజో స్టోరీ' ఖాతా సైతం ఉంది.

Unnao case: FIR against 8 Twitter handles for 'fake news'
ఉన్నావ్​ కేసు: నకిలీ వార్తలను పోస్ట్ చేస్తున్నారని 8ఖాతాలపై ఎఫ్​ఐఆర్

By

Published : Feb 22, 2021, 4:16 PM IST

ఉత్తర్​ప్రదేశ్ ఉన్నావ్ ఘటనపై నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలతో 8 ట్విట్టర్​ ఖాతాలపై పోలీసులు ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు. సీనియర్​ జర్నలిస్ట్​ బార్కా దత్ నిర్వహిస్తున్న 'మోజో స్టోరీ' ఖాతా​ సైతం ఈ జాబితాలో ఉంది.

"జర్నలిజం సిద్ధాంతాలనే మేము అనుసరించి.. ఈ ఘటనపై అన్నికోణాల్లో వివరాలను అందచేశాం. పోలీసుల చర్యపై కోర్టులో పోరాడేందుకు సిద్ధం. ఎఫ్​ఐఆర్​ కాపీని అడిగితే ఉన్నావ్ పోలీసులు ఇవ్వలేదు. మాకు రాజకీయ నాయకీయ నాయకులతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు."

-- బార్కా దత్, సీనియర్​ జర్నలిస్ట్​

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్​ జిల్లాలో ముగ్గురు బాలికలు పొలంలో అపస్మారక స్థితిలోకనిపించారు. గ్రామస్థులు వారిని జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో బాలికను కాన్పుర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు.

ఇదీ చదవండి :భారీ భద్రత మధ్య ఉన్నావ్​ బాలికల అంత్యక్రియలు

ABOUT THE AUTHOR

...view details