తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గంగా జలంతో కేసుల పరిష్కారం- పోలీసులపై చర్యలు - Ramkumar Sharma

ఓ కేసు పరిష్కారంలో ఉత్తర్​ప్రదేశ్ పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక పోలీసుల వద్దకు వచ్చిన బాధితుడితో వింతగా ప్రవర్తించారు వారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయకుండా.. ఎర్రచందన తిలకం, గంగాజలం, గాయత్రి మంత్రంతో సమస్య పరిష్కారమవుతుందని.. హరిద్వార్​కు వెళ్లి గాయత్రి మంత్రం జపించాలని సూచించారు.

Unique workstyle of UP's Meerut Police in solving cases
గంగాజలంతో కేసు పరిష్కారం!- పోలీసులపై చర్యలు

By

Published : Apr 2, 2021, 5:07 PM IST

ఉత్తర్​ప్రదేశ్ మేరఠ్​ పోలీసులు ఓ కేసును తమదైన శైలిలో పరిష్కరించడానికి ప్రయత్నించి.. వివాదంలో చిక్కుకున్నారు. ఓ వ్యక్తి కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించగా... కేసు నమోదు చేయకుండా, వింత సలహాలు ఇచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

ఇదీ జరిగింది

మేరఠ్​కు జిల్లాలోని నౌచండి ప్రాంతానికి చెందిన హేమంత్​ గోయల్​.. రెండో భార్య, సవతి కుమారుడి వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించాడు. అయితే బాధితుడితో వింతగా ప్రవర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడానికి బదులు గంగాజలం, ఎర్రచందనంతో బొట్టు పెట్టారు.

అనంతరం.. "హరిద్వార్‌కు వెళ్లి అక్కడి గాయత్రి ఆశ్రమంలో మూడు రోజులు బస చేయాలి. బ్రహ్మ ముహూర్త సమయంలో గాయత్రి మంత్రాన్ని పఠించాలి. గంగాజలాన్ని తాగాలి. ఇలా చేయడం ద్వారా కుటుంబ వేధింపుల నుంచి విముక్తి లభిస్తుంది అని సిబ్బంది చెప్పారు. నా చేతిలో స్టేషన్​ ఇన్​స్పెక్టర్ ఓ మంత్రాన్ని రాశారు. మీ ఆలోచనలు మంచిగా ఉండాలి అని అన్నారు" అని చెప్పాడు హేమంత్. దీంతో దిక్కుతోచని బాధితుడు.. రెండు రోజుల పాటు పోలీసులు చెప్పినట్లు చేశాడు. తర్వాత న్యాయం కోసం ఐజీ కార్యాలయాన్ని సంప్రదించాడు. దీంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

అధికారులపై చర్యలు..

పోలీసుల వింత ప్రవర్తనకు సంబంధించిన కేసుపై మీడియాతో మాట్లాడటానికి ఉన్నతాధికారులు నిరాకరించారు. అయితే బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. సంబంధిత ఇన్​స్పెక్టర్​పై చర్యలు తీసుకోవాలని ఐజీ ఆదేశించారు.

ఇదీ చూడండి:విషం తాగి అత్యాచార బాధితురాలు మృతి

ABOUT THE AUTHOR

...view details