తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రచయితకు రాయడం.. అమ్మడం రెండూ తెలుసు - ఉడుపి రచయిత భిన్నమైన ఆలోచన

అందరిలా కాకుండా కాస్త భిన్నంగా ఆలోచించాడు కర్ణాటకకు చెందిన ఓ యువ రచయిత. పుస్తకాలు గొప్పగా రాయడమే కాదు.. తాను రాసిన పుస్తకాలు ఎక్కువ మంది చదివేలా చేయాలనుకున్నాడు. వినూత్న ఆలోచనతో అందరి చూపు తన కొత్త పుస్తకంపై పడేలా చేస్తున్నాడు. ఇంతకీ ఆ రచయిత ఏం చేశాడో తెలుసుకోండి మరి..

Unique way of promoting books by young writer in Udupi
'రాయడం..అమ్మడం' రెండూ తెలిసిన రచయిత అతను

By

Published : Dec 24, 2020, 3:43 PM IST

కర్ణాటక ఉడుపికి చెందిన ఓ యువ రచయిత తన నూతన పుస్తకం అమ్మకాన్ని కాస్త భిన్నంగా ప్లాన్​ చేశాడు. ప్రజలు ఏ చోట తిరిగినా తన పుస్తకాన్ని కొనాలనే ఆలోచన వచ్చేలా చేశాడు.

ఫుడ్​ ఉచితం..

'దారి తప్పిసు దేవరె వర్క్' పుస్తక రచయిత మంజునాథ్ కమంత్ స్థానిక ప్రజల్లో మంచి ఆదరణ పొందాడు. తను ఇటీవలే రాసిన 'చందదా హల్లిన హుడుగి మత్తు 18 అవ్​లుగల కాత్తే' పుస్తకం అమ్మకం అందరిలా కాకుండా భిన్నంగా చేస్తున్నాడు. సోడా షాపుల్లో, చేపల స్టాల్స్​, హోటల్స్​, మొబైల్​ షాపులు, ఇతర షాపుల్లో పుస్తకం అమ్మాలని నిర్ణయించుకున్నాడు.

బేకరిలో అమ్మకం
మొబైల్​ షాపులో అమ్మకానికి పెట్టిన పుస్తకం

సోడా షాపులో తన పుస్తకం కొన్న వారికి సోడా ఉచితంగా ఇవ్వాలని, రెస్టారెంట్​లో కొంటే చేపలు ఇవ్వాలని, మొబైల్​ షాపులో కొంటే హెడ్​సెట్​ ఉచితంగా ఇవ్వాలని రచయిత చెప్పాడు. ఫలితంగా పుస్తక ప్రియుల నుంచే కాకుండా ఇతరుల నుంచి కూడా ఈ పుస్తకానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత జోగి ఆవిష్కరించారు.

బంగారం షాపులో
కొబ్బరి బోండాల దుకాణంలో
బడ్డీ కొట్టులో అమ్మకం

ఇదీ చదవండి:'ఠాగూర్ స్ఫూర్తితోనే ఆత్మనిర్భర్ భారత్'

ABOUT THE AUTHOR

...view details