కబ్జాకు గురైన తన భూమిని తిరిగి అప్పగించాలంటూ ప్రభుత్వ కార్యాలయాల చూట్టూ తిరిగి విసుగెత్తిన ఓ వృద్ధుడు వినూత్నంగా నిరసన చేపట్టారు. భూమికి సంబంధించిన మ్యాప్‌ను చొక్కాపై ముద్రించుకుని కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. మరొకరు ఛత్తీస్‌గఢీ భాషకు అధికారిక హోదా దక్కాలంటూ 15 ఏళ్లగా పోరాటం చేస్తున్నారు. కర్ర, టోపీ ధరించి.. చొక్కాపై ఛత్తీస్‌గఢీ అని రాసుకొని నిరసన తెలుపుతున్నారు.
బిలాస్‌పుర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని బిర్కోనా గ్రామానికి చెందిన 80 ఏళ్ల లాటెల్రామ్ యాదవ్‌కు రెండు ఎకరాల భూమి ఉంది. కొందరు కబ్జాదారులు ఆ భూమిపై కన్నేశారు. ప్రభుత్వ అధికారులతో చేతులు కలిపి.. లాటెల్రామ్ భూమిని కబ్జా చేశారు. దీనిపై అనేక సార్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగిన లాటెల్రామ్కు విసుగు వచ్చింది. దీంతో సమస్య పరిష్కరానికి వినూత్నంగా నిరసన చేపట్టాలని అనుకున్నాడు. కబ్జాకు గురైన భూమికి సంబంధించిన మ్యాప్‌ను దుస్తులపై ముద్రించుకుని నిరసన చేపట్టారు. కబ్జాకు గురైన తన భూమిని తిరిగి తన పేరుపై నమోదు చేయాలంటూ ప్రభుత్వ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.
మరో వృద్ధుడు సైతం ఇదే తరహాలో నిరసన చేపట్టారు. ఛత్తీస్‌గఢీ భాషకు అధికారిక హోదా కల్పించాలని కోరుతూ 15 ఏళ్లగా పోరాటం చేస్తున్నారు. బిలాస్‌పుర్‌కు చెందిన నంద్‌కుమార్ శుక్లా.. చొక్కాపై ఛత్తీస్‌గఢీ అని ముద్రించుకుని నిరసన చేపట్టారు. టోపీ ధరించి.. చేతిలో కర్ర పట్టుకుని.. అధికారిక భాష హోదా కోసం నినాదాలు చేస్తున్నారు.