తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెళ్లైన గంటకే భార్యకు విడాకులు.. తమ్ముడికి ఇచ్చి మరోసారి వివాహం - ఉత్తర్​ ప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

మొదటి భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకున్నాడు ఓ వ్యక్తి. అనంతరం పెళ్లైన గంటకే రెండో భార్యకు విడాకులు ఇచ్చి.. ఆమెను తన సోదరుడికిచ్చి వివాహం జరిపించాడు. ఉత్తర్​ప్రదేశ్​ సంభాల్​లో వింత ఘటన జరిగింది.

man given divorce after 1 hour of marriage
man given divorce after 1 hour of marriage

By

Published : Jan 5, 2023, 4:49 PM IST

మొదటి భార్య ఉండగానే రెండో వివాహం చేసుకున్నాడు ఓ వ్యక్తి. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య వాగ్వాదానికి దిగడం వల్ల.. పెళ్లైన గంటకే రెండో భార్యకు విడాకులు ఇచ్చాడు. అనంతరం ఆమెను తన సోదరుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ ఘటన ఉత్తర్​ ప్రదేశ్​లోని సంభాల్​ జిల్లాలో జరిగింది.

ఇదీ జరిగింది
అస్మోలీ పోలీస్ స్టేషన్​ పరిధిలోని సైద్​నగలి​ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి 4 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. దంపతుల మధ్య గొడవలు తలెత్తడం వల్ల భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ఒంటరిగా ఉన్న భర్త.. దబోయి ఖుర్ధ్​ గ్రామానికి చెందిన ఓ యువతితో సంబంధం పెట్టుకున్నాడు. ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య పెళ్లి మండపానికి చేరుకుని వాగ్వాదానికి దిగింది. తాను బతికే ఉండగా రెండో వివాహం ఎలా చేసుకుంటారని ప్రశ్నించింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండో పెళ్లి చేసుకున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్​ స్టేషన్​కు తీసుకువచ్చారు. అనంతరం పంచాయితీ పెట్టగా.. రెండో భార్యకు విడాకులు ఇచ్చి తన సోదరుడికే ఇచ్చి వివాహం జరిపించాడు. దీంతో గొడవ సద్దుమణిగింది. దీనిపై ఎలాంటి ఫిర్యాదు తమకు అందలేదని పోలీసులు చెప్పారు.

ఇవీ చదవండి:ముగ్గురు పిల్లల తల్లితో సంబంధం.. పెళ్లి చేసుకోమందని 35సార్లు కత్తితో పొడిచి హత్య

వృద్ధుడి ముక్కులో 5 అంగుళాల జలగ.. చూసి షాకైన డాక్టర్లు.. కానీ శ్రమించి..

ABOUT THE AUTHOR

...view details