తోటి పిల్లలతో కలిసి ఆటపాటల్లో మునిగితేలాల్సిన వయసులో.. ఏదో కొత్తగా చేయాలనే తపన. తన కోరికను కరోనాతో విధించిన లాక్డౌన్ తీర్చింది. తనలోని కళతో.. దేశంలోని ప్రముఖుల చిత్రపటాలను పెన్సిల్‌తో అచ్చుగుద్దినట్లు గీస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. అతనే ఒడిశాకు చెందిన తొమ్మిదేళ్ల సోను.
ఒడిశా కటక్‌లోని కందర్పుర్ ప్రాంతానికి చెందిన బిభు ప్రసాద్ స్వేయిన్, ఇతిశ్రీ మోహపాత్రల కుమారుడు సోను. తనలోని మేధాశక్తితో ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. తనకు దొరికిన ఖాళీ సమయంలో స్నేహితులతో ఆటలాడకుండా.. చిత్రలేఖనంలో మునిగితేలుతాడు. చిన్నతనంలోనే కుమారుడిలోని ప్రత్యేక ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు ఆ దిశగా ప్రోత్సహించారు. ప్రస్తుతం ఎందరో ప్రముఖల చిత్రాలను అందంగా, అచ్చంగా గీస్తున్న కొడుకును చూసి మురిసిపోతున్నారు.
ఈ చిన్నారి గీసిన చిత్రాల్లో.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు వంటి ప్రముఖులు ఉన్నారు.