సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష 2021 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. ఫలితాలను యూపీఎస్సీ తన అధికారిక వెబ్సైట్ https://www.upsc.gov.inలో అందుబాటులో ఉంచింది.
యూపీఎస్సీ ప్రిలిమ్స్-2021 ఫలితాలు విడుదల - యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష
సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష 2021 ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఫలితాలను తన అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఫలితాలు
అక్టోబరు 10న దేశవ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్షలను యూపీఎస్సీ నిర్వహించింది. పరీక్ష నిర్వహించిన 20 రోజుల్లోనే ఈ ఫలితాలను విడుదల చేసింది. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలో క్వాలిఫై అయిన వారు... 2022 జనవరి 7న జరిగే మెయిన్స్ పరీక్షకు అర్హులవుతారు.
Last Updated : Oct 29, 2021, 10:30 PM IST