తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీకా అందుకున్న కేంద్రమంత్రులు, దలైలామా - సదానంద గౌడ

కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, నరేంద్ర సింగ్ తోమర్ సహా సదానంద గౌడ శనివారం కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. ఆధ్యాత్మిక గురువు దలైలామాకు.. హిమాచల్​ ప్రదేశ్​లో వ్యాక్సిన్​ అందించారు.

Union ministers who received the vaccine alongside Dalai Lama
టీకా అందుకున్న కేంద్రమంత్రులు.. దలైలామా

By

Published : Mar 6, 2021, 12:44 PM IST

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఆయన భార్య కంచన్ గడ్కరీ కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. మహారాష్ట్రలోని నాగ్​పుర్​ ఎయిమ్స్​లో శనివారం టీకా స్వీకరించారు.

టీకా అందుకున్న గడ్కరీ దంపతులు

దిల్లీలోని ఆర్​ఎంఎల్​ ఆసుపత్రిలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్​కు టీకా వేశారు.

వ్యాక్సిన్ స్వీకరిస్తున్న కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్

మరో కేంద్ర మంత్రి సదానంద గౌడ కూడా బెంగళూరులో కొవిడ్ టీకా అందుకున్నారు.

టీకా వేయించుకున్న కేంద్ర మంత్రి సదానంద గౌడ

ఆధ్యాత్మిక గురువు దలైలామా వ్యాక్సిన్​ వేయించుకున్నారు. హిమాచల్​ప్రదేశ్​లోని ధర్మశాల జోనల్ ఆసుపత్రిలో ఆయన టీకా స్వీకరించారు. ఈ సందర్భంగా అందరి శ్రేయస్సు కోసం ప్రజలు పెద్దఎత్తున వచ్చి టీకా తీసుకోవాలని దలైలామా కోరారు. ఆయనకు వ్యాక్సిన్ అందించినందుకు భారత ప్రభుత్వానికి దలైలామా కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది.

వ్యాక్సిన్ తీసుకుంటున్న దలైలామా

ఇదీ చూడండి:'కుండ్లీ ఎక్స్​ప్రెస్​వే'ను దిగ్బంధించిన రైతులు

ABOUT THE AUTHOR

...view details