తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుమార్తె పెళ్లిలో స్టెప్పులేసిన కేంద్ర మంత్రి - ప్రహ్లాద్ జోషి డ్యాన్సులు

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి.. తన కుమార్తె వివాహంలో స్టెప్పులేశారు. సతీమణితో కలిసి ఉత్సాహంగా డాన్సులు చేశారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి.

Pralhad Joshi's dance
ప్రహ్లాద్ జోషి డ్యాన్సు

By

Published : Sep 2, 2021, 5:24 PM IST

కుమార్తె పెళ్లిలో స్టెప్పులేసిన కేంద్ర మంత్రి

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి.. స్టెప్పులతో అందరినీ అలరించారు. కుమార్తె వివాహ వేడుకలో డ్యాన్సు చేశారు. సతీమణితో కలిసి పాత కన్నడ సినిమాలోని ఓ పాటకు స్టెప్పులేశారు. జోషి.. డ్యాన్స్​ చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

వధూవరులను ఆశీర్వదిస్తున్న కర్ణాటక సీఎం బొమ్మై
నూతన వధూవరులతో కర్ణాటక సీఎం బొమ్మై

జోషి కుమార్తె అర్పిత.. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త రిషికేశ్​ను వివాహమాడారు. కర్ణాటకలోని హుబ్లీలో ఈ పెళ్లి జరిగింది. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్​​, సీఎం బసవరాజ బొమ్మై, కర్ణాటక శాసనమండలి ఛైర్మన్ బసవరాజ్ హోరత్తి తదితరులు ఈ వివాహానికి హాజరయ్యారు.

రాజకీయ ప్రముఖులతో వధూవరులు
కర్ణాటక గవర్నర్​తో నవ వధూవరులు

రిసెప్షన్ వేడుకకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:Family murder: సొంత కుటుంబాన్నే కడతేర్చిన కొడుకు

ABOUT THE AUTHOR

...view details