కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్(70) కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ వేదికగా శుక్రవారం వెల్లడించారు. ఇటీవల తనకు సన్నిహితంగా ఉన్నవారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
"నాకు ఈరోజు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. గత రెండు మూడు రోజులుగా నన్ను కలిసిన వారంతా.. టెస్ట్‌లు చేయించుకోండి."