కేరళలో అధికారంలోకి వస్తే శబరిమల కోసం ప్రత్యేక చట్టం తెస్తామని హామీ ఇచ్చింది భాజపా. బలవంతపు మతమార్పిళ్లను అరికట్టేందుకు మరో చట్టం చేస్తామని వాగ్దానం చేసింది. ఈమేరకు రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోను తిరువనంతపురంలో విడుదల చేశారు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్. తమది ప్రగతిశీల, క్రియాశీల, ఆకాంక్ష అభివృద్ధి ఆధారిత మేనిఫెస్టో అని పేర్కొన్నారు. ఇలాంటి మేనిఫెస్టో కోసమే కేరళ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు.
శబరిమల కోసం ప్రత్యేక చట్టం: భాజపా హామీ - కేరళలో భారతీయ జనతా పార్టీ
శబరిమలలో భక్తుల మనోభావాలు పరిరక్షించేలా కొత్త చట్టం, బలవంతపు మతమార్పిళ్లు అరికట్టేలా లవ్ జిహాద్ చట్టం, విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు వంటి హామీలతో కేరళ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసింది భాజపా.
కేరళలో భాజపా హామీలు ఇవే
కేరళలో భాజపా హామీలు..
- ఉగ్రవాదం, ఆకలి లేని రాష్ట్రంగా కేరళ నిర్మాణం
- హైస్కూల్ విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు
- ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
- భూమిలేని ఎస్సీ, ఎస్టీలకు 5 ఎకరాలు
- ఏడాదికి ఆరు ఉచిత గ్యాస్ సిలిండర్లు
Last Updated : Mar 24, 2021, 7:12 PM IST