తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత.. స్టేజీపై ఉండగానే ఒక్కసారిగా.. - nitin gadkari latest news

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అనారోగ్యానికి గురయ్యారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన.. వేదికపైనే అసౌకర్యానికి గురయ్యారు.

nitin-gadkari-falls-sick-
nitin-gadkari-falls-sick-

By

Published : Nov 17, 2022, 2:46 PM IST

Updated : Nov 17, 2022, 6:00 PM IST

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. బంగాల్​లోని సిలిగుడిలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన.. స్టేజీపై ఉండగానే కాస్త అసౌకర్యానికి గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. వైద్యుడిని ఆగమేఘాల మీద సభావేదిక ఉన్న ప్రాంతానికి తీసుకొచ్చారు. గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి మరీ.. వైద్యుడిని తరలించారు.

సిలిగుడిలోని సేవక్ కంటోన్మెంట్ పరిధిలో.. నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు నితిన్ గడ్కరీ వచ్చారు. వేదికపై ఉన్న ఆయన.. కాస్త అసౌకర్యానికి గురయ్యారు. దీంతో కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేశారు. ఓ గదిలో విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లిన ఆయనకు మరింత అసౌకర్యంగా అనిపించింది. వెంటనే వైద్యుడిని పిలిపించారు. కేంద్ర మంత్రిని పరీక్షించిన డాక్టర్.. ఆయనకు ప్రాథమిక పరీక్షలు చేశారు. రక్తంలో చక్కెర స్థాయులు పడిపోయినట్లు వైద్యుడు గుర్తించారు. అనంతరం, సెలైన్ ఎక్కించారు. చికిత్స తర్వాత నితిన్ గడ్కరీని డార్జీలింగ్ ఎంపీ రాజు బిస్తా తన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు చికిత్స కొనసాగుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి.

మమత ఆరా..
నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారన్న వార్తలపై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. విషయం తెలిసిన వెంటనే సిలిగుడి పోలీస్ కమిషనర్​కు ఫోన్ చేశారు. గడ్కరీ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. ఆయన చికిత్స విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు మమత.

Last Updated : Nov 17, 2022, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details