తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్రమంత్రి నారాయణ్​ను 9 గంటలు విచారించిన మహారాష్ట్ర పోలీసులు - దిశా సాలియన్‌ మృతి కేసు

Union minister Narayan Rane: సుశాంత్​ సింగ్​ మాజీ మేనేజర్​ దిశా సాలియన్​ మృతి కేసుకు సంబంధించి కేంద్ర మంత్రి నారాయణ్ రాణే, ఆయన కుమారుడు ఎమ్మెల్యే నితీశ్​ రాణేలను మహారాష్ట్ర పోలీసులు తొమ్మిది గంటలు విచారించారు. ఈ విచారణ నేపథ్యంలో అక్కడకు చేరుకున్న భాజపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే నిరసరకారులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది.

Union minister Narayan Rane latest news
Union minister Narayan Rane latest news

By

Published : Mar 6, 2022, 4:51 AM IST

Union minister Narayan Rane: దివంగత బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మాజీ మేనేజర్‌ దిశా సాలియన్‌ మృతిపై తప్పుదోవపట్టించే ప్రకటనలు చేశారని నమోదైన కేసులో కేంద్రమంత్రి నారాయణ్‌ రాణే కుమారుడు ఎమ్మెల్యే నితీశ్​ రాణేను మహారాష్ట్రలోని మాల్వాని పోలీసులు తొమ్మిది గంటలపాటు విచారించారు. మధ్యాహ్నం ఒంటిగంట 45 నిమిషాలకు తండ్రితో కలిసి మాల్వాని పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన నితీశ్​ రాణేను రాత్రి 10 గంటల 45 నిమిషాలకు స్టేషన్‌ నుంచి బయటకు వెళ్లారు.

ఆ గురువారం విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని మాల్వాని పోలీసులు గతంలో నోటీసులు ఇచ్చారు. శుక్రవారం విచారణకు హాజరవుతామని కేంద్రమంత్రి నారాయణ్‌ రాణే పోలీసులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో శాసనసభ సమావేశాలు ఉన్నందున శనివారం విచారణకు హాజరవుతారని కేంద్రమంత్రి తరఫు న్యాయవాది.. పోలీసులను అభ్యర్థించారు. దీంతో ఇద్దరు నేతలు శనివారం పోలీసుల ఎదుట హాజరయ్యారు. మరోవైపు వారిద్దరిని పోలీసులు అరెస్టు చేయకుండా న్యాయస్థానం మార్చి 10 వరకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

పోలుసులతో ఘర్షణ

పోలీసులు వారిని ప్రశ్నిస్తున్న సమయంలోనే కేంద్రమంత్రి మద్దతుదారులు భారీగా తరలివచ్చారు. వారిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నింగా.. ఘర్షణకు దిగారు. దీంతో పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి:స్వదేశానికి మరో 15విమానాలు- కొత్త అడ్వైజరీతో విద్యార్థుల్లో అయోమయం

ABOUT THE AUTHOR

...view details