మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యల కేసులో కేంద్ర మంత్రి నారాయణ్ రాణెను(narayan rane news) ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం ఏ ఏడాది వచ్చిందో తెలియని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను చెంపదెబ్బ కొట్టేవాడినని రాణె చేసిన వ్యాఖ్యల(narayan rane statement)పై దుమారం రేగిన నేపథ్యంలో తొలుత పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భాజపా చేపట్టిన జన్ ఆశిర్వాద్ కార్యక్రమం కోసం రాష్ట్రంలో పర్యటిస్తున్న రాణెను రత్నగిరి ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సంగమేశ్వర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
మహా రాజకీయాల్లో హైడ్రామా- కేంద్రమంత్రి అరెస్ట్ - ఉద్ధవ్ ఠాక్రే
15:04 August 24
మహా రాజకీయాల్లో హైడ్రామా- కేంద్రమంత్రి అరెస్ట్
అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నానని రాణె చెప్పగా.. వైద్యులను పిలిపించి పరీక్షలు చేయించారు పోలీసులు.
పిటిషన్ తిరస్కరణ!
అంతకుముందు.. పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కోసం రాణె చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు కేంద్ర మంత్రి. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని అభ్యర్థించారు. పిటిషన్‌పై మంగళవారమే అత్యవసర విచారణ చేపట్టాల్సిందిగా రాణె తరఫున న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. న్యాయవాది అభ్యర్థనను తిరస్కరించిన జస్టిస్ ఎస్ఎస్ శిండే, జస్టిస్ ఎన్జే జమాదర్తో కూడిన ధర్మాసనం.. సరైన ప్రక్రియను అనుసరించాలని ఆదేశించింది. తొలుత.. రిజిస్ట్రీ విభాగంలో అత్యవసర విచారణకు దరఖాస్తు చేసుకోవాలని, ఆ తర్వాత పిటిషన్‌పై విచారణ చేపట్టాలా? వద్దా? అన్న విషయాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది.
మరోవైపు రాణె వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన శివసేన కార్యకర్తలు పలుచోట్ల ఆందోళనకు దిగారు. నాసిక్‌లోని భాజపా కార్యాలయంపై రాళ్లురువ్వారు. నాసిక్‌సహా పలు ప్రాంతాల్లో శివసేన శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.