తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొడుకు కేంద్ర మంత్రి అయినా.. కూలీకి వెళ్తూ జీవనం

కేంద్ర మంత్రి పదవిలో ఉన్న ఓ వ్యక్తి తల్లిదండ్రులు.. వ్యవసాయ కూలీ పనులు చేస్తారంటే నమ్మగలరా? ప్రభుత్వం ఇచ్చే సాయం కోసం అందరితో పాటే క్యూలో నిల్చొంటారంటే ఊహించగలరా? కానీ, కేంద్ర మంత్రి ఎల్​.మురుగన్ తల్లిదండ్రులను చూస్తే నమ్మి తీరాల్సిందే. ఇప్పటికీ వారు తమ ఊరిలోనే వ్యవసాయ పనులకు వెళ్తూ నిరాడంబరంగా జీవిస్తున్నారు.

By

Published : Jul 19, 2021, 4:39 PM IST

Updated : Jul 19, 2021, 7:41 PM IST

Union Minister Murugan's parents
కేంద్ర మంత్రి ఎల్​.మురుగన్ తల్లిదండ్రులు

కేంద్ర మంత్రి ఎల్​.మురుగన్ తల్లిదండ్రులు

తమ కుమారుడు కేంద్రమంత్రి పదవి చేపట్టినా ఆ దంపతులు తమ జీవన విధానాన్ని మర్చిపోలేదు. కష్టపడితేనే సంతృప్తిగా బతకలగమని భావించారు. అందుకే.. ముదిమి వయసులోనూ వ్యవసాయ పనులకు వెళ్తూ స్వతంత్రంగా బతుకుతున్నారు. వారే కేంద్ర మత్స్య, పాడి, పశు సంరక్షణ శాఖ, సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్​.మురుగన్ తల్లిదండ్రులు.

కేంద్ర మంత్రి ఎల్​.మురుగన్ తల్లిదండ్రుల ఇల్లు

ఎల్​.మురుగన్​ తల్లిదండ్రులు ​వరుదమ్మల్, లోకనాథన్​ది తమిళనాడు నమక్కల్​ జిల్లా కొన్నూర్​ గ్రామం. ​అరుంధతియార్​ అనే దళిత సామాజికవర్గానికి చెందిన వీరు.. తమ ఊరిలోనే ఓ చిన్న ఇంట్లో నివసిస్తూ ఉంటారు. తమ కుమారుడు ఎల్​.మురుగన్​ తమిళనాడు భాజపా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా.. వీళ్లు వ్యయసాయ కూలీ పనులకు వెళ్తూనే జీవించేవారు.

సైకిల్​పై పార పట్టుకొని పొలం పనులకు వెళ్తున్న కేంద్ర మంత్రి ఎల్​. మురుగన్ తండ్రి లోకనాథన్​
పొలం పనులు చేస్తున్న కేంద్ర మంత్రి ఎల్​.మురుగన్​ తండ్రి

'మేం చేసిందేం లేదు'

కేంద్ర మంత్రి స్థాయికి ఎల్​.మురుగన్​ ఎదగడంలో తాము చేసిందేమీ లేదని అంటారు ఎల్.మురుగన్ తల్లి వరుదమ్మల్. స్వయంకృషితోనే తమ కుమారుడు ఆ స్థాయికి చేరుకున్నారని.. అందుకు తామెంతో సంతోషిస్తున్నామని చెప్పారు. తాము వ్యవసాయ పనులు చేసేందుకు వెళ్లగా వచ్చిన డబ్బులతో తమ కుమారుడిని చదివించామని తెలిపారు.

డాక్టర్ అంబేడ్కర్ న్యాయ కళాశాల నుంచి న్యాయవిద్యను అభ్యసించిన ఎల్​.మురుగన్​.. కొన్నాళ్లపాటు లాయర్​గా పనిచేశారు. అనంతరం ఆయన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్​, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్​(ఆర్​ఎస్​ఎస్​)లో చేరారు. న్యాయవాదిగా ఆయన భాజపా తరఫున ఎన్నో కేసులను వాదించారు.

కేంద్ర మంత్రి ఎల్.మురుగన్

స్వతంత్రంగా కష్టపడుతూ జీవించడంలోనే తాము సంతోషంగా ఉండగలమని అంటున్నారు లోకనాథన్​, వరుదమ్మల్​ దంపతులు. రాష్ట్ర ప్రభుత్వం అందించే కొవిడ్​ సాయాన్ని తీసుకోవడానికి ఇటీవల వారు క్యూలో నిల్చున్నారని కొన్నూర్​ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చెప్పారు.

ఇదీ చూడండి:పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడిగా నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ

ఇదీ చూడండి:పేరుకు ప్రైవేటు స్కూల్.. ఫీజు మాత్రం ఏడాదికి రూ.500!

Last Updated : Jul 19, 2021, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details