తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్​కు కరోనా​ - జితేంద్ర సింగ్ వార్తలు

దేశంలో కొవిడ్​ బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్​కు వైరస్​ సోకినట్టు తేలింది. మరోవైపు.. దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ సతీమణికీ కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఫలితంగా.. ఆమెతో పాటు సీఎం స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు దిల్లీ ప్రభుత్వం వెల్లడించింది.

Jitendra Singh
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్​

By

Published : Apr 20, 2021, 3:08 PM IST

కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటం వల్ల.. పరీక్షలు చేయుంచుకోగా కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు ఆయన తెలిపారు. ఇటీవలి కాలంలో తనను కలిసినవారందరూ టెస్టులు చేయించుకోవాలని ట్విట్టర్ వేదికగా కోరారు.

జితేంద్ర సింగ్​ ట్వీట్

"నాకు స్వల్పంగా వైరస్​ లక్షణాలు కనిపించినందున ఈ రోజు పరీక్షలు చేయించుకుంటే కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఇటీవల నాకు సన్నిహితంగా మెలిగినవారంతా దయచేసి జాగ్రత్తలు పాటించండి."

- జితేంద్ర సింగ్​, కేంద్ర మంత్రి

సీఎం కేజ్రీవాల్​ సతీమణికీ పాజిటివ్​

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ సతీమణి సునీతా కేజ్రీవాల్​కూ వైరస్​ సోకినట్టు తేలింది. దీంతో ఆమె స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆమెతో పాటు సీఎం కూడా క్వారంటైన్​లో ఉండనున్నట్టు దిల్లీ ప్రభుత్వం తెలిపింది.

అరవింద్​ కేజ్రీవాల్​ సతీమణి సునీతా కేజ్రీవాల్​

ఇదీ చదవండి:స్పుత్నిక్​-వి 10 రోజుల్లో భారత్​లోకి!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details