తెలంగాణ

telangana

ETV Bharat / bharat

CAA Act: 'అందుకే.. పౌరసత్వ సవరణ చట్టం ఉండాలన్నాం' - సీఏఏ

అఫ్గానిస్థాన్ పరిస్థితుల నేపథ్యంలో వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై(CAA Act) కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి హర్​దీప్ సింగ్ పురి. మైనారిటీలను సీఏఏ ఆదుకుంటుందని అన్నారు.

CAA, hardip
హర్​దీప్​ సింగ్ పురి

By

Published : Aug 23, 2021, 5:00 AM IST

Updated : Aug 23, 2021, 6:25 AM IST

అఫ్గానిస్థాన్‌ పరిస్థితుల నేపథ్యంలో వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై (CAA Act) (సీఏఏ) కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి కీలక వ్యాఖ్యలు చేశారు. అఫ్గాన్‌లో హిందువులు, సిక్కులపై దాడులు జరుగుతున్నాయని, వారు భారత్‌లో తలదాచుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయని, ఇలాంటి వారి కోసమే తాము సీఏఏ (CAA Act) తెచ్చామని తెలిపారు.

తాలిబన్ల చెర నుంచి తప్పించుకొని 23 మంది అఫ్గాన్‌ హిందువులు, సిక్కులు వాయుసేన విమానంలో భారత్‌ చేరుకున్నారన్న వార్తలపై పురి స్పందిస్తూ.. మైనారిటీలను సీఏఏ అదుకుంటుందని అన్నారు. ముస్లిం మెజారిటీ దేశాలైన పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో మత హింసకు గురైన మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పించేలా మోదీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం తెచ్చింది. ఈ బిల్లును 2019లో పార్లమెంట్‌ ఆమోదించింది. అయితే ఇందులో ముస్లింలను చేర్చకపోవడంతో వివాదాస్పదమైంది. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. దీంతో బిల్లు అమలును(NRC bill) ప్రభుత్వం నిలిపివేసింది.

ఇదీ చదవండి:Afghan crisis: 'భారత్ మాకు​ రెండో ఇల్లు'.. అఫ్గానీల ఆనందబాష్పాలు

Last Updated : Aug 23, 2021, 6:25 AM IST

ABOUT THE AUTHOR

...view details