కరోనా టీకా సమర్థతపై ప్రశ్నించేవారిని తీవ్రంగా విమర్శించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ప్రజారోగ్యం విషయంలో రాజకీయాలెందుకని విపక్షాలనుద్దేశించి అన్నారు. వ్యాక్సిన్‌పై అసత్య ప్రచారం ఆపాలని కోరిన షా.. ఈ విషయమై మరో వేదికగా చర్చలకు తాము సిద్ధమన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా డ్రైవ్‌ను దేశంలో ప్రారంభించామన్న ఆయన.. భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితమని చెప్పారు. అసోంలోని గువాహటిలో జరిగిన 'ఆయుష్మాన్ భారత్' కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
"వ్యాక్సిన్‌పై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇతర వేదికలపైకి రండి.. వ్యాక్సిన్ సమర్థతపై చర్చిద్దాం. కానీ ఇలా ప్రజల ఆరోగ్యంపై రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? ప్రజలందరికీ చెబుతున్నా.. మన శాస్త్రవేత్తలు రూపొందించిన వ్యాక్సిన సురక్షితమైనది. సందేహాలు వద్దు. మీ వంతు వచ్చినప్పుడు టీకా వేయించుకోండి."