తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​లో హింసపై నివేదిక కోరిన కేంద్రం - బంగాల్​లో ఘర్షణలు

బంగాల్​లో ఎన్నికల ఫలితాల తర్వాత విపక్షాలే లక్ష్యంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘర్షణలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర హోం శాఖ బంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బంగాల్​లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో ముగ్గురు కార్యకర్తలు హత్యకు గురయ్యారు.

Union Home Ministry
హోం శాఖ

By

Published : May 3, 2021, 7:58 PM IST

Updated : May 3, 2021, 8:30 PM IST

బంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘర్షణలపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని బంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది కేంద్ర హోం శాఖ. ఈ ఘర్షణల్లో ముగ్గురు కార్యకర్తలు హత్యకు గురయ్యారు. వీరిలో ఇద్దరు భాజపా చెందిన వారు కాగా మరో వ్యక్తి ఐఎస్ఎఫ్​ కార్యకర్త.

'తృణమూల్ పనే'

బంగాల్​లో ఘర్షణలు చెలరేగటానికి మమతా బెనర్జీ కారణం అంటూ.. భాజపా విమర్శనాస్త్రాలు సంధించింది. తమ పార్టీ కార్యకర్తలే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ దాడులకు పాల్పడుతోందని మండిపడింది.

" రాష్ట్ర ప్రజలను కాపాడటం మీ (మమతా బెనర్జీ) ప్రధాన కర్తవ్యం. 18 ఎంపీలు, 77 మంది ఎమ్మెల్యేలు ఉన్న మేము.. ఇలాంటి హింసపై పోరాడతాం."

-- బీఎల్ సంతోష్ , భాజపా జనరల్ సెక్రటరీ

ఘర్షణలకు సంబంధించిన వీడియోలు, చిత్రాలను సైతం భాజపా నేతలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. మరోవైపు ఇలాంటి ఘర్షణలపై కార్యకర్తలు శాంతియుతంగా ఉండాలని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా మౌనంగా వ్యవహరించాలని మమతా బెనర్జీ సూచించారు.

ఇదీ చదవండి :ఉత్తరాఖండ్​లో ఆకస్మిక వరదలు- దెబ్బతిన్న ఇళ్లు

Last Updated : May 3, 2021, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details