తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మావోయిస్టులపై పోరులో జవాన్లకు అండగా ఉంటాం: షా

By

Published : Apr 5, 2021, 9:27 AM IST

Updated : Apr 5, 2021, 7:07 PM IST

Union Home Minister Amit Shah will visit today the site where Naxals attacked security personnel at Sukma-Bijapur border in Chhattisgarh
బీజాపుర్ ఎన్​కౌంటర్ ప్రాంతానికి అమిత్​ షా

18:59 April 05

జవాన్లతో షా సమావేశం

ఛత్తీస్​గఢ్​ బీజాపుర్​లోని సీఆర్​పీఎఫ్​ క్యాంపు వద్ద జవాన్లతో హోం మంత్రి అమిత్​ షా సమావేశమయ్యారు.  

జవాన్లు ఎంతో ధైర్య సాహసాలతో పోరాడన్నారు షా. మావోయిస్టు సమస్య వల్లే ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదన్నారు. లోంగిపోవాలనుకునే వారు జనజీవన స్రవంతిలోకి వస్తే స్వాగతిస్తామని పేర్కొన్నారు.    

మావోయిస్టులపై పోరులో జవాన్లకు కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జవాన్ల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు.

14:28 April 05

బీజాపుర్​ ఎన్​కౌంటర్​ సమయంలో కోబ్రా దళానికి చెందిన ఓ జవానును ఎత్తుకెళ్లామన్న నక్సలైట్ల ప్రకటనలో నిజానిజాలు తేల్చేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 

జవానును కిడ్నాప్ చేశామని ఆదివారం సాయంత్రం బీజాపుర్​కు చెందిన ఓ జర్నలిస్టుకు నక్సలైట్లు ఫోన్​ చేసి చెప్పారు. వారి ప్రకటన నిజమయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని సదరు అధికారి తెలిపారు. ఎన్​కౌంటర్​ జరిగినప్పటి నుంచి కనిపించకుండాపోయిన 210వ కోబ్రా దళ జవాను రాకేశ్వర్ సింగ్​ మిన్హాస్ ఆచూకీ ఇంకా తెలియలేదని వివరించారు. 

13:02 April 05

నక్సల్స్​పై జరిగే పోరాటంలో విజయం సాధిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రం తరఫున బీజాపుర్​ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు తాను నివాళి అర్పిస్తున్నానని తెలిపారు. జవాన్ల త్యాగాలు చిరస్మరణీయం,  వారి త్యాగాలు వృథా కావన్నారు. ఛత్తీస్​గఢ్​లోని ఉన్నతాధికారులతో సమావేశమైన అనంతరం షా మీడియాతో మాట్లాడారు.   

12:05 April 05

ఛత్తీస్​గఢ్​ జగదల్​పుర్​లోని ఉన్నతాధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు.  ఈ కార్యక్రమంలో ఛత్తీస్​గఢ్​ సీఎం భూపేశ్ బఘేల్​ పాల్గొన్నారు.  

11:19 April 05

బీజాపుర్ ఎన్​కౌంట​ర్​లో వీర మరణం పొందిన జవాన్లకు నివాళి అర్పించారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. అనంతరం జగదల్​పుర్​లోని ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. గాయపడ్డ జవాన్లను పరామర్శించనున్నారు. ఆ తర్వాత సీర్​పీఎఫ్​ క్యాంపు కార్యాలయాన్ని సందర్శించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

11:13 April 05

ఛత్తీస్​గఢ్ ఎన్​కౌంటర్​లో వీర మరణం పొందిన జవాన్లకు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా పుష్ప గుచ్ఛాలతో నివాళులు అర్పించారు. మరికాసేపట్లో ఉన్నత అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. 

10:46 April 05

మావోయిస్టుల కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్లకు కాసేపట్లో ఛత్తీస్​గఢ్​లోని జగ్​దల్​పుర్​లో కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, ఛత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ ఘన నివాళులు అర్పించనున్నారు.

10:20 April 05

అధికార లాంఛనాలతో..

మావోయిస్టుల ఘాతుకంతో.. వీర మరణం పొందిన జవాన్లకు భద్రతా దళాలు అంజలి ఘటించాయి. ఛత్తీస్​గఢ్​ బీజాపుర్​లో అమర జవాన్లకు అధికార లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. జవాన్ల పార్థీవ దేహాలపై జాతీయ పతాకాన్ని కప్పి.. పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. 

వీర జవాన్ల కుటుంబీకుల రోదనలు అందరినీ కలచివేస్తున్నాయి. 

09:10 April 05

లైవ్​: బీజాపుర్ ఎన్​కౌంటర్ ప్రాంతానికి అమిత్​ షా

ఛత్తీస్‌గఢ్‌లో బస్తర్ అడవుల్లో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పరిశీలించనున్నారు. మరికాసేపట్లో అక్కడికి చేరుకోనున్నారు.

భద్రతా దళాలపై మావోయిస్టులు దాడి చేసిన ప్రాంతాన్ని ఆయన ఉన్నతాధికారులతో కలిసి పరిశీలిస్తారు. అనంతరం.. నక్సల్స్​ కాల్పుల్లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను పరామర్శించనున్నారు. మారణకాండపై ఇప్పటికే ఉన్నతస్ధాయి సమీక్ష నిర్వహించారు హోం మంత్రి. మావోయిస్టులకు సరైన సమాధానం ఇస్తామని తెలిపారు. 

బీజాపుర్​- సుక్మా జిల్లా సరిహద్దుల్లో జరిగిన మావోయిస్టుల దాడిలో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 400 మంది నక్సల్స్​ జరిపిన ఈ దాడిలో మరో 30కి పైగా సైనికులు గాయాలపాలయ్యారు.

Last Updated : Apr 5, 2021, 7:07 PM IST

ABOUT THE AUTHOR

...view details