తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బంగాల్​లో పౌర చట్టాన్ని అమలు చేసేది అప్పుడే' - రోనా టీకా పంపిణీ ప్రక్రియ ముగిశాక బంగాల్​లో సీఏఏని అమలు

కొవిడ్​ వ్యాక్సినేషన్​ ప్రక్రియ పూర్తైన అనంతరం.. పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) బంగాల్​లో అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. బంగాల్​ ఠాకూర్​ నగర్​లో నిర్వహించిన భాజపా బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. బంగాల్​లో తామే అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. అప్పటివరకు విశ్రమించేది లేదన్నారు.

Union Home Minister Amit Shah in Thakurnagar in WestBengal
పౌరసత్వ చట్టాన్ని అమలు చేసేది అప్పుడే!

By

Published : Feb 11, 2021, 6:00 PM IST

Updated : Feb 11, 2021, 8:53 PM IST

కొవిడ్​ టీకా పంపిణీ ప్రక్రియ పూర్తయ్యాక పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) బంగాల్​లో అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ప్రకటించారు. సీఏఏ కింద బంగాల్​లోని శరణార్థులతో పాటు మతువా సామాజిక వర్గానికి భారత పౌరసత్వం ఇస్తామని పేర్కొన్నారు. సీఏఏ విషయంలో మైనార్టీలను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. బంగాల్​లోని ఠాకూర్​ నగర్​లో నిర్వహించిన భాజపా ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు.

పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువస్తామని 2018లో భాజపా మాటిచ్చింది. అన్నట్టుగానే 2019లో గెలిచిన తర్వాత తీసుకువచ్చింది. సీఏఏని బంగాల్​లో అమలుచేయనివ్వబోమని మమతా బెనర్జీ అన్నారు. కానీ మేం అమలు చేసి తీరుతాం. సీఏఏను అడ్డుకోవడానికి ఎన్నికల తర్వాత ఆమె అధికారంలో ఉండరు. ఇక్కడికి భారీగా తరలి వచ్చిన మతూవా సామాజికవర్గాన్ని చూస్తే వచ్చే ప్రభుత్వం భాజపాదేనని కచ్చితంగా చెప్పగలను. కొన్ని అనివార్య కారణాల వల్ల ముందు అనుకున్నట్లుగా ఇక్కడికి రాలేకపోయాను. నేను రానందుకు మమతా దీదీ సంతోషించి ఉంటారు."

-అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి

ఏప్రిల్​లో ఎన్నికలు కాబట్టి.. అప్పటి వరకు చాలా సమయం ఉందని, మళ్లీ మళ్లీ బంగాల్​కి వస్తానని అమిత్ ​షా అన్నారు. మమత ఓడిపోయే వరకు వస్తూనే ఉంటానని తెలిపారు.

ఒడిశా, తెలంగాణలోనూ..

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పోరాటం... మమతా బెనర్జీని గద్దె దించటానికి మాత్రమే కాదని, బంగాల్​ను స్వర్ణ బంగ్లాగా మార్చేందుకేనని అమిత్ షా పేర్కొన్నారు. మూడింట రెండో వంతు మెజార్టీతో తాము అధికారం చేపడతామని అన్నారు. కోల్​కతాలో నిర్వహించిన భాజపా సమాజిక మాధ్యమ ప్రచార కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బంగాల్​ విజయం.. ఒడిశా, తెలంగాణల్లో భాజపా అధికారంలోకి వచ్చేందుకు బాటలు పరుస్తుందని అన్నారు.

ఇదీ చూడండి:కేరళలో 'బ్యాక్​ డోర్​' రాజకీయం- విజయన్​కు కష్టమే!

Last Updated : Feb 11, 2021, 8:53 PM IST

ABOUT THE AUTHOR

...view details