ఛత్తీస్‌గఢ్ బస్తర్ అడవుల్లో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో.. వీర మరణం పొందిన జవాన్లకు నివాళులు అర్పించారు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పుర్‌లో జవాన్లకు పుష్ఫ గుచ్ఛాలతో నివాళులు అర్పించారు. ఆయనతో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అమర జవాన్లకు అమిత్ షా నివాళి - జవాన్లకు నివాళి అర్పించిన అమిత్ షా
బీజాపుర్ ఎన్కౌంటర్లో వీర మరణం పొందిన జవాన్లకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాళి అర్పించారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పుర్‌లో పుష్ప గుచ్ఛాలతో షా శ్రద్ధాంజలి ఘటించారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వీర జవాన్లకు నివాళి అర్పించిన అమిత్ షా
బీజాపుర్- సుక్మా జిల్లా సరిహద్దుల్లో శనివారం జరిగిన మావోయిస్టుల దాడిలో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 400 మంది నక్సల్స్ జరిపిన ఈ దాడిలో మరో 30మందికిపైగా సైనికులు గాయాలపాలయ్యారు.
ఇదీ చదవండి :సీఆర్పీఎఫ్ అమర జవాన్లకు 'సైకత' నివాళి