సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్ మిశ్ర తీవ్ర స్వరంతో హెచ్చరిస్తున్న వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం నాటి లఖింపుర్‌ఖేరి ఘటనకు 9 రోజుల ముందు (సెప్టెంబరు 25న) ఈ దృశ్యాలు రికార్డయినట్లుగా తెలుస్తోంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఖేరి లోక్‌సభ నియోజకవర్గంలో అజయ్ మిశ్ర పర్యటిస్తుండగా పాలియా అనే ప్రాంతంలో రైతులు నల్లజెండాలతో నిరసన తెలిపినప్పటి వీడియో అది.
మంత్రి ఆగ్రహంతో మాట్లాడుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. "నేను తలచుకుంటే మిమ్మల్ని అందరినీ దారిలోకి తీసుకురావడానికి రెండు నిమిషాలకు మించి సమయంపట్టదు" అని మంత్రి హెచ్చరించారు. "నేను ఒక మంత్రి, ఎంపీని మాత్రమే కాదు.. లోక్‌సభకు ఎన్నిక కావడానికి చాలా ముందు నుంచే నేనేమిటో ప్రజలకు బాగా తెలుసు. ఒక్కసారి సవాల్‌ను స్వీకరించానంటే వెనకడుగు వేసే ప్రశ్నే లేదు.