దేశంలో బ్లాక్‌ఫంగస్(మ్యూకర్మైకోసిస్) వ్యాధి క్రమంగా విస్తరిస్తున్న క్రమంలో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ ఫంగస్‌ను సాంక్రమిక వ్యాధి చట్టం- 1897 కింద గుర్తించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. బ్లాక్ ఫంగస్ వ్యాధి గుర్తింపు, చికిత్స, నివారణపై ఐసీఎంఆర్ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది.
ప్రత్యేక కేంద్రాలు..
బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్సకు దిల్లీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. దిల్లీలో బ్లాక్‌ఫంగస్ కేసులు పెరుగుతున్న క్రమంలో ఉన్నతాధికారులు, నిపుణులతో కేజ్రీవాల్ సమావేశమయ్యారు.