తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఆ ప్రయాణికులకు కేంద్రం కొత్త రూల్స్ - ఇండియా ఇంటర్నేషనల్ అరైవల్స్

భారత్​కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల (Omicron India travel) కోసం కొత్త నిబంధనలు అమలులోకి తీసుకురానున్నట్లు కేంద్రం తెలిపింది. 14 రోజుల ప్రయాణ వివరాలు సహా కొవిడ్ నెగెటివ్ ధ్రువపత్రాన్ని ఎయిర్ సువిధ పోర్టల్​లో అప్​లోడ్ చేయడాన్ని తప్పనిసరి చేసింది. భారత్​కు వచ్చాక ఎయిర్​పోర్ట్​లో కొవిడ్ టెస్టు చేయించుకొని.. ఫలితం వచ్చే వరకు అక్కడే వేచి ఉండాలని స్పష్టం చేసింది.

omicron new international arrivals rules
omicron new international arrivals rules

By

Published : Nov 28, 2021, 10:13 PM IST

ప్రపంచంలోని పలు దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై కేంద్రం (Omicron India travel advisory) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్​కు రావాలనుకునే ప్రయాణికులు.. తమ 14 రోజుల ప్రయాణ వివరాలు (Omicron India covid) తప్పనిసరిగా సమర్పించాలని నిబంధన విధించింది. ప్రయాణానికి ముందు ఆర్​టీ-పీసీఆర్ నెగెటివ్ ధ్రువపత్రాన్ని ఎయిర్ సువిధ పోర్టల్​లో అప్​లోడ్ చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సవరించిన మార్గదర్శకాల జాబితాను విడుదల చేసింది. ఈ నిబంధనలు (India travel restrictions) డిసెంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది.

కరోనా ముప్పు అధికంగా ఉన్న దేశాలకు చెందిన ప్రయాణికులు.. భారత్​కు వచ్చిన తర్వాత కొవిడ్ టెస్టు (India travel guidelines) చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. ఫలితాలు వచ్చే వరకు ప్రయాణికులు ఎయిర్​పోర్ట్​లోనే ఉండాలి. నెగెటివ్ వస్తే ఏడు రోజుల పాటు హోంక్వారంటైన్​లో ఉండాలి. ఎనిమిదో రోజు మరోసారి కరోనా టెస్టు చేయించుకోవాలి. అందులోనూ నెగెటివ్ వస్తే.. ఏడు రోజుల పాటు స్వీయ పర్యవేక్షణలో ఉండాలి.

విమానంలో 5శాతం మందికి మాత్రం...

కొవిడ్ ముప్పు అధికంగా ఉన్న దేశాలు మినహా మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు... ఫలితం రాకముందే ఎయిర్​పోర్ట్ నుంచి వెళ్లిపోవాలని మార్గదర్శకాల్లో కేంద్రం పేర్కొంది. అయితే.. 14 రోజుల పాటు స్వీయ పర్యవేక్షణలో ఉండాలని తెలిపింది. విమానంలోని 5 శాతం మంది ప్రయాణికులను మాత్రం ర్యాండమ్​గా పరీక్షించనున్నట్లు స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణపై 'ఒమిక్రాన్​' ఎఫెక్ట్​!

ABOUT THE AUTHOR

...view details